తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన పెద్దగా ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో విజయాన్ని అందుకుంటూ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి వి వి ధానయ్య నిర్మిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాని వరుసగా మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా సరిపోతా శనివారం సినిమా తర్వాత నాని , సుజిత్ దర్శకత్వంలో డి వి వి ధానయ్య బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నిన్న నాని పుట్టిన రోజు సందర్భంగా వెలువడింది.

ఇకపోతే గత కొంత కాలంగా బలగం సినిమా దర్శకుడు వేణు దర్శకత్వంలో శిరీష్ , హర్షిత్ నిర్మాణంలో నానిమూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నా విషయం మన అందరికీ తెలిసిందే. ఇక నిన్న నాని పుట్టిన రోజు నాడు వేణు మరియు శిరీష్ , హర్షిత్ , నాని ని కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీనితో వీరి కాంబో లో ఓ సినిమా ఉండబోతుంది అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: