టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ఫీల్ గుడ్‍ మూవీగా లెక్కలేనన్ని ప్రశంసలు దక్కించుకుంది.కొత్త దర్శకుడు శౌర్యవ్‍ ఈ మూవీని తెరకెక్కించిన విధానం, అతడి టేకింగ్ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ నటన, హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం మెప్పించాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా 'హాయ్ పాపా' అనే పేరుతో ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, థియేటర్లలో హిందీ వెర్షన్‍కు అనుకున్న స్థాయిలో స్పందన అయితే రాలేదు.కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా సీన్ పూర్తిగా మారింది.హాయ్ నాన్న సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం ఇంకా మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జనవరి 4వ తేదీన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యింది. తొలి వారం తెలుగుతో పాటు హిందీ వెర్షన్ 'హాయ్ పాపా'కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఏకంగా టాప్-5లో ట్రెండ్ అయ్యాయి. అయితే, హిందీ వెర్షన్ జోరు మాత్రం 50 రోజులైన ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఈ సినిమా టాప్-10లో కంటిన్యూ అవుతోంది.'హాయ్ పాపా' చిత్రం 50 రోజుల నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఇండియా ట్రెండింగ్‍లో టాప్-10లోనే కొనసాగుతోంది.


సోషల్ మీడియాలో కూడా చాలా మంది హిందీ జనాలు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. మన నాని పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతున్నారు. దీంతో హిందీలో కూడా న్యాచులర్ స్టార్ బాగా పాపులర్ అయ్యారు. మొత్తానికి నార్త్ లో నానికి దసరా సినిమాతో రాని క్రేజ్ హాయ్ పాపా సినిమాతో వచ్చింది.నాని తదుపరి మూవీ 'సరిపోదా శనివారం' కూడా పాన్ ఇండియా రేంజ్‍లో విడుదల కానుంది.ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ ని ప్రత్యాంగిరా వాళ్ళు కొన్నారు.'హాయ్ పాపా' మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సూపర్ పాపులర్ కావడంతో హిందీలో 'సరిపోదా శనివారం' మూవీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరిపోదా శనివారం మూవీ హిందీలో 'సూర్యాస్ సాటర్‌డే' పేరుతో రిలీజ్ కానుంది. నాని పుట్టిన రోజైన ఫిబ్రవరి 24న ఈ మూవీ గ్లింప్స్ ని కూడా రిలీజ్ అయింది. శనివారం మాత్రమే కోపం చూపించే వ్యక్తి అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 29న ఈ సినిమా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: