తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ తాజాగా గామి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విద్యాదర్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే మార్చి 8 వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీనీ మరియు వేదికను ఖరారు చేస్తూ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 

మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఫిబ్రవరి 29 వ తేదీన ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గామి సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న విశ్వాక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ.లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలోనే విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం మొదట ప్రకటించింది.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మళ్లీ ఈ సినిమా విడుదలకు సంబంధించి కొన్ని వార్తలు బయటికి వచ్చిన ఇప్పటి వరకు ఈ మూవీ కి విడుదలకి సంబంధించిన అధికారిక ప్రకటనను మాత్రం ఈ చిత్ర బృందం ప్రకటించలేదు. ఇకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs