మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆఖరుగా గాండీవ దారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ సినిమా వరుణ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని మిగిల్చింది. ఇకపోతే గాంధీవ దారి అర్జున లాంటి బారి ఫెయిల్యూర్ తర్వాత ఈ యువ నటుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

మూవీ కి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించగా ... మనిషి చిల్లర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మార్చి 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన ఒక్కో అప్డేట్ ను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇకపోతే నిన్న ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క నైజాం హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఆంధ్ర మరియు సీడెడ్ థియేటర్ హక్కులను ఏ సంస్థల వారు దక్కించుకున్నారు అనే విషయాలను అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా యొక్క ఆంధ్ర ఏరియా థియేటర్ హక్కులను ఎస్ సినిమాస్ సంస్థ వారు దక్కించుకున్నట్లు ... అలాగే ఈ మూవీ యొక్క సీడెడ్ థియేటర్ హక్కులను ఎన్విఆర్ సినిమా సంస్థ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt