జూనియర్ ఎన్టీఆర్ తన తాత అంశతోనే జన్మించారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చిన్నతనంలో ఉండగానే సీనియర్ ఎన్టీఆర్ ఆ విషయాన్ని గుర్తించారు.అందుకే ఆయనకు స్వయంగా తన తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ తన పేరుని నామకరణం చేశారు. అయితే ఎన్టీఆర్ పుట్టుకను ఆ కుటుంబమంతా కూడా అసహ్యించుకుంది, శాలిని ఫ్యామిలీలోకి ఎవ్వరూ ఎంటర్ కానివ్వలేదు. అలాగే ఇంట్లో జరిగిన ఏ ఫ్యామిలీ ఫంక్షన్ కి అయినా ఒక పని మనిషికి ఇచ్చిన విలువ కూడా శాలినికి జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వలేదు అనేది జగమెరిగిన సత్యం. తండ్రి హరికృష్ణ అండదండలు ఒక్కటే కాదు అలాగే తాత ఎన్టీఆర్ బ్లెస్సింగ్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి కొంత కాలానికి దక్కాయి. ఒకరోజు ఎన్టీఆర్ గారు శాలిని ని అలాగే తారక్ ని పిలిచి కూర్చోబెట్టి నా మనవడిని నా అంతటి వారిని చేయాల్సిన బాధ్యత నీపైనే ఉంది, నువ్వు ఎంత బాధ్యత తీసుకుంటావో నీ అంత బాధ్యతలు నేను కూడా తీసుకుంటాను. వాడిని జాగ్రత్తగా పెంచులంటూ షాలిని కి చెప్పారట.కానీ ఈ విషయం జరిగిన కొన్ని రోజులకే ఎన్టీఆర్ మరణించడం జరిగింది. ఎన్టీఆర్ మరణాన్ని తారక్ ఆ వయసులోనే తట్టుకోలేకపోయాడట. బాగా ఏడ్చేసారట. తన జీవితంలో ఉన్న కొండంత అందరూ కోల్పోయాను అనే విషయం ఆ రోజే గ్రహించారట తారక్.

ఇక హరికృష్ణ మాత్రమే వారిని ప్రేమించే ఒక వ్యక్తి. నందమూరి కుటుంబం మొత్తం వారిని ఎక్కడికో విసిరేస్తుంది అని అందరూ అనుకున్నారు.  కానీ దేవుడి దయవల్ల ఎన్టీఆర్ బతికున్న సమయంలోనే తారక్ కి చేయాల్సిన మంచి చేసి వెళ్లిపోయారు. తారక్ ని హీరో చేయాలని రాఘవేంద్రరావుకి సూచించారట ఆ టైంలోనే. తండ్రి కృషి కారణంగా త్వరగానే ఇండస్ట్రీలోకి వచ్చి తాత పేరు నిలబెట్టే సినిమాలు చేశాడు జూనియర్.కాబట్టి దేవుడి దయవల్ల ఈ రోజు నందమూరి కుటుంబానికి ఏకైక మూడో తరం వారసుడిగా తారక్ నిలబడ్డాడు. అందరి ఆశీస్సులను పొందగలుగుతున్నాడు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ కనుక తారక్ కూడా మిగత నందమూరి హీరోల మాదిరిగానే ఫెయిల్ అయి ఉండి ఉంటే ఎవరు దగ్గరికి తీసేవారు కాదు ఇది అందరికీ తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: