టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిమనులలో అంజలి ఒకరు. ఇప్పటి వరకు ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ గీతాంజలి అనే హారర్ కామెడీ జోనర్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను ఎంత గానో అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా రాబట్టింది. 

ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా "గీతాంజలి మళ్లీ వచ్చింది" అనే మూవీ ని రూపొందించారు. ఇందులో కూడా అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఇకపోతే మొదట ఈ సినిమాని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా విడుదలను మాత్రం ఈ మూవీ యూనిట్ వాయిదా వేసింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఏప్రిల్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా తో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , సునీల్ , సత్య , షకలక శంకర్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే మంచి విజయం సాధించినటువంటి గీతాంజలి సినిమాకి కొనసాగింపుగా తెరకెక్కిన మూవీ కావడంతో "గీతాంజలి మళ్లీ వచ్చింది" సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: