తెలుగు సినీ పరిశ్రమలో కమీడియన్ గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో వెన్నెల కిషోర్ ఒకరు. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలలో కమీడియన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఈ నటుడు తాజాగా "చారి 111" అనే సినిమాలో హీరో గా నటించాడు. టీజీ కీర్తీ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బర్కత్‌ స్టూడియోస్‌ బ్యానర్ పై నిర్మాత అతిథి సోనీ దీనిని గ్రాండ్ గా నిర్మించిన విషయం తెలిసిందే. సంయుక్తా విశ్వనాథన్‌ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... మురళీ శర్మ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. 

ఇకపోతే ఈ సినిమాను మార్చి 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ  సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "యు / ఏ" సర్టిఫికెట్ లభించింది ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు కమిడియన్ గా సూపర్ సక్సెస్ అయిన వెన్నెల కిషోర్మూవీ తో హీరోగా ఏ స్థాయి గుర్తింపును దక్కించుకుంటాడు చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది ..? ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే మార్చి 1 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vk