రాజమౌళి సినిమా అంటే చాలు ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు. అలాంటిది ఏకంగా టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందో అని అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంది. రాజమౌళి సినిమా అంటే హీరోలకి రూల్స్ ఉంటాయి. ఇక ఇప్పటికే మహేష్ బాబుకు ట్రేక్కింగ్ విషయంలో శిక్షణ తీసుకోవాలని సూచించడంతోపాటు ఫిట్నెస్ విషయంలో కూడా రాజమౌళి పలు సూచనలు చేశాడట.


 ఇక మహేష్ కి ఇలాంటి కండిషన్స్ పెట్టాడంటే.. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది అని ఇక అర్థమవుతుంది. అయితే ఇక ఈ సినిమాకు మహారాజా అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా మహేష్ బాబుతో సినిమా కోసం ఒక హాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ని రంగంలోకి దింపబోతున్నాడట రాజమౌళి. ఆయన ఎవరో కాదు జేమ్స్ కామరూన్. టైటానిక్, అవతార్ లాంటి సినిమాలతో ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తిన లెజెండరీ డైరెక్టర్ ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం  ఇండియా వస్తున్నట్లు కొన్ని వార్తలు ఉన్నాయి. ఈయన మాత్రమే కాదు జురాసిక్ పార్క్ వంటి అద్భుతమైన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన స్టీవెన్ స్పిల్ బర్గ్ సైతం ఇక మూవీ ప్రారంభోత్సవానికి రాబోతున్నట్లు సమాచారం. హాలీవుడ్ డైరెక్టర్లు తీసుకువచ్చే బాధ్యతలను అటు కార్తికేయ తీసుకున్నాడట. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించాలి అనే ఉద్దేశంతోనే రాజమౌళి ఇక ఇవ్వాలి అయితే కామరూన్ గ్రీన్ లాంటి డైరెక్టర్ రాజమౌళి పిలిస్తే వస్తారా అని అనుమానాలు కూడా అందరిలో ఉన్నాయి   అయితే ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా చూసి  ఫిదా అయ్యాను అంటూ ప్రశంసలు కురిపించడంతో.. ఆయన వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: