సీనియర్ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ చిన్నతనంలోనే సినీ అరంగేట్రం చేశారు.తన తండ్రితో కలిసి అనేక సినిమాల్లో నటించారు. అంతేకాకుండా తన నటనతో అన్నిరకాల ఆడియెన్స్ ని మెప్పించారు. తన తండ్రి సైతం బాలకృష్ణ నటనకి ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఎన్టీఆర్ నటవారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నట సింహం బాలకృష్ణ. అంతేకాకుండా తన నటనతో తెలుగు ఆడియెన్స్ ని ఎంతగానో మెప్పించి జై బాలయ్యగా పిలువబడుతున్నారు. ఈయన కనిపిస్తే చాలు జై బాలయ్య కేరింతలతో బాలయ్య ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక బాలయ్య నటించిన మూవీస్ లో చాలా మూవీస్ ఫ్యాక్షనిస్ట్ మూవీస్ ఉంటాయి. తన మాస్ మ్యానరిజంతో మూవీస్ మాస్ ఆడియెన్స్ ని అంతలా ఆకట్టుకుంటాయి.1980-90లలో ఫ్యామిలీ ఆడియెన్స్ ను, తర్వాత మాస్ ఆడియెన్స్, ఆ తర్వాత ఫ్యాషన్ చిత్రాలతో ఫ్రేక్షకులని అలరించారు బాలయ్య. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెలతో ఫ్యాన్స్ కి పూనకాలను తెప్పించేవారు. బాలకృష్ణ ప్రస్తుత వయస్సు 64 ఏళ్లు. ప్రస్తుతం వీరికి బ్రాహ్మణి, తేజస్వి, మోక్షజ్ఞ ముగ్గురు పిల్లలు. బ్రాహ్మణినీ నారా చంద్రబాబునాయుడు కొడుకు అయిన లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అలాగే తేజస్వినీ కూడా వైజాగ్ గీతం సంస్థలకు చెందిన భరత్ కి ఇచ్చి పెళ్లి చేశారు. కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞని హీరోగా పెట్టి మూవీ చేయడానికి మాస్ మూవీల దర్శకుడు అయిన బోయపాటి శ్రీను అప్పట్లో స్టోరీ కూడా చెప్పాడని వార్తలు వచ్చాయి.ఇక ఇదిలా ఉంటే..బాలకృష్ణకి ప్రముఖ బిజినెస్ మెన్ దేవులపల్లి సూర్యారావు ద్వితీయ కుమార్తె అయినటువంటి వసుంధరాదేవితో 1982 డిసెంబర్ 8 ఉదయం 11 నుంచి, మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుపతిలోని కర్ణాటక మండపంలో పెళ్లయినట్టుగా తెలుస్తోంది.తాజాగా బాలకృష్ణ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తన భార్య పేరు, తన పేరు ఆ వెడ్డింగ్ లో పొందుపరిచారు. ఇంతకీ ఈ కార్డు నందమూరి వారి పెళ్లి కార్డు కాదు వారి మామగారు అయినటువంటి దేవరపల్లి సూర్యారావు, ప్రమీలారాణి దంపతుల పేర్లతో ముద్రించిన కార్డు.

మరింత సమాచారం తెలుసుకోండి: