మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో విశ్వ సుందరి మనుషి చిల్లర్ హీరోయిన్ గా నటించగా ... రూహాని శర్మ , నవదీప్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మార్చి 1 వ తేదీన తెలుగు , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. 

ఇకపోతే తాజాగా సెన్సార్ పూర్తి అయిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "యు / ఏ" సర్టిఫికెట్ లభించింది. ఇకపోతే ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని రెండు గంటల నాలుగు నిమిషాల నిడివితో ఈ మూవీ బృందం లాక్ చేసినట్లు సమాచారం.

భారీ నిడివి లేకుండా చాలా తక్కువ రన్ టైమ్ తోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆఖరుగా వరుణ్ గాండీవదారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అపజయాన్ని అందుకున్నాడు. మరి ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt