మాస్ మహారాజా రవితేజ తాజాగా టాలీవుడ్ యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి కావ్య దాపర్ , అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్ లుగా నటించగా ... నవదీప్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకుంది. 

దానితో ఈ మూవీ భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయకపోయినప్పటికీ డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఈటీవీ విన్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు దక్కించుకున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈటీవీ విన్ "ఓ టి టి" సంస్థ వారు ఈగల్ మూవీ ప్రీమియర్స్ ను ఈ వీకెండ్ నుండి స్ట్రీమింగ్ చేనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈటీవీ విన్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయినా తేదీ నుండే అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈగల్ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt