మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆఖరుగా టాలీవుడ్ యువ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గాంధీవధర అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సాక్షా వైద్య హీరోయిన్ గా నటించగా ... నాజర్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇలా గాండీవదార అర్జున సినిమాతో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచిన వరుణ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ రేపు అనగా మార్చి 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం వారు ఈ మూవీ ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. దానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో వరుణ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వరుణ్ మాట్లాడుతూ ... ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఒక మంచి సినిమా. ఈ మూవీ ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కానక్ట్ అవుతుంది. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా అందరూ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది అని వరుణ్ చెప్పుకొచ్చాడు. ఇలా వరుణ్ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt