టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. ఇకపోతే గత కొంత కాలంగా వరుస ఆపజాయలను బాక్లు ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న ఈయన ఆఖరుగా ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో తిరిగి శర్వానంద్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన ఓ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఆ మూవీ కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శర్వానంద్ ఇప్పటికే తన తదుపరి మూవీ ని కూడా కన్ఫామ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ తన తదుపరి మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించబోయే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్ లో తెరకక్కబోయే సినిమాలో హీరో గా నటించడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ... ప్రస్తుతం ఈ సంస్థ వారు శర్వా కోసం ఒక అదిరిపోయే కథను అదే విధంగా ఓ మంచి దర్శకుడుని వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

అన్ని కుదిరాక ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనలు ఈ సంస్థ వారు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శర్వానంద్ ఆఖరుగా నటించిన ఒకే ఒక జీవితం సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ... వెన్నెల కిషోర్ , ప్రియదర్శిమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లోని నటనకు గాను శర్వానంద్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: