టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఆసినిమా టాక్ తెలియాలి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ దేవి ధియేటర్లలోని సగటు ప్రేక్షకులు ఆసినిమాకు ఎలాంటి స్పందన వచ్చింది అన్నవిషయం పై ఆసినిమా విజయాన్ని భారీ సినిమా విడుదలైన కొన్ని గంటలలోనే అంచనా వేస్తారు. టాలీవుడ్ మహేష్ నటించిన ఎన్నో సినిమాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ధియేటర్లలో రికార్డులు క్రియేట్ చేశాయి.



అలాంటి సెంటర్ లో ఒక మల్టీ ప్లెక్స్ 7 స్క్రీన్స్ తో కడితే ఎలా ఉంటుంది అన్నఆలోచన మహేహ కు రావడంతో ఇప్పుడు ఆ ఆలోచన కార్యరూపం దాలుస్తోంది అన్నమాటలు వినిపిస్తున్నాయి. ఎన్నో హిట్ సినిమాలకు చిరునామాగా నిలిచిన సుదర్శన్ 70 ఎంఎమ్ థియేటర్ లో 7 స్క్రీన్లతో నిర్మింపబోతున్న మల్టీ ప్లెక్స్ కు ఎఎంబి క్లాసిక్ అని నామకరణం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమల్టీ ప్లెక్స్ నిర్మాణం ప్రముఖ ఏషియన్ భాగస్వామ్యంలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.



గతంలో టాప్ హీరో వెంకటేష్ ఇదే ప్రాంతంలో మల్టీ ప్లెక్స్ నిర్మాణం చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఆప్రపోజల్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మహేష్ ఈమల్టీ ప్లెక్స్ నిర్మాణ బాధ్యతలను స్వీకరించడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అన్ని హంగులతో నిర్మాణం జరుపుకోబోతున్న మొట్టమొదటి మల్టీ ప్లెక్స్ గా మారబోతోంది.



ఇప్పటికే భాగ్యనగరంలోని మాదాపూర్ లో ఏర్పడిన ఎ ఎమ్ జీ మల్టీ ప్లెక్స్ ధియేటర్లు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో టాప్ హీరోల సినిమాలను ఆ ధియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సింగిల్ స్క్రీన్స్ లో సినిమాలు చూడటం కంటే మల్టీ ప్లెక్స్ లో టిక్కెట్ ధర ఎక్కువైనా ప్రేక్షకులు సినిమాను చూడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో మల్టీ ప్లెక్స్ ధియేటర్ల సంస్కృతి బాగా పెరిగి పోతోంది. ఇప్పటికే మహేష్ తో పాటు ఈ మల్టీ ప్లెక్స్ ధియేటర్ల వ్యాపారంలో ప్రభాస్ విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ లు ఎంటర్ అయిన పరిస్థితులలో త్వరలో ఈ వ్యాపార రంగంలోకి రవితేజా ఎంటర్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: