తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వ సుందరి మనుషి చిల్లర్ , వరుణ్ కి జోడిగా నటించగా ... శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. నవదీప్ , రూహాని శర్మ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా మార్చి 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ భాషలలో విడుదల కానుంది.

మూవీ విడుదలకు చాలా రోజుల ముందే ఈ సినిమాకు సంబంధించిన "ఓ టి టి" హక్కులను ఈ మూవీ బృందం వారు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఆపరేషన్ వాలెంటైన్ మూవీ యొక్క "ఓ టి టి" ధరలను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఏకంగా 26 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. ఈ మూవీ కి 17 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కనుక ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేసి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt