నల్సేన్ కె. గఫూర్ మరియు మమిత బైజు ప్రధాన పాత్రల్లో తాజాగా కన్నడ లో ప్రేమలు అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించగా ... సంగీత్ ప్రతాప్ , శ్యామ్ మోహన్ , అఖిలా భార్గవన్ , మరియు మీనాక్షి రవీంద్రన్ ఈ మూవీ లో కీలక పాత్రలను పోషించారు. ఇకపోతే పెద్దగా అంచనాలు లేకుండా మలయాళం లో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మలయాళ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. 

దానితో ఈ సినిమాకు ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇలా ఈ సినిమాకు మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతూ ఉండడంతో ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నట్లు అనేక వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ వార్తలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళం లో ఇప్పటికే సూపర్ సక్సెస్ ను అందుకున్న ప్రేమలు సినిమాని తెలుగు లో ఎస్ ఎస్ కార్తికేయ విడుదల చేయబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని తెలుగు లో మార్చి 8 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఈ చిత్ర బృందం తాజాగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది  ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే మలయాళం లో ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ప్రేమలు మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా మంచి మంచి పెట్టుకున్నారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: