తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన మూవీ లాల్ సలామ్. ఈ మూవీలో విష్ణు విశాల్‌ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు.ఈ మూవీకి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్డ్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా ఫిబ్రవరి 9న రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లాల్ సలామ్ మూవీ తమిళంలో పది కోట్లలోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. తెలుగు వెర్షన్ లో కోటిలోపే కలెక్షన్స్ దక్కించుకున్నది. రజనీకాంత్ తెలుగు డబ్బింగ్ మూవీస్‌లో అతి తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా చెత్త రికార్డును మూటగట్టుకున్నది.ఈ సినిమా కథ విషయానికి వస్తే కసుమూరుకు చెందిన మొయుద్దీన్ (రజనీకాంత్‌) గొప్ప బిజినెస్‌మెన్‌గా పేరు తెచ్చుకుంటాడు. కొడుకు శంషుద్దీన్‌ను (విక్రాంత్‌) క్రికెటర్‌గా చూడాలన్నది మొయుద్దీన్ కల. ఊళ్లో క్రికెట్ మ్యాచ్ లో జరిగిన గొడవలో శంషుద్దీన్ చేయిని గురు (విష్ణు విశాల్‌) నరికేస్తాడు. క్రికెట్ గొడవ ఊళ్లో మతకల్లోలానికి దారితీస్తుంది. తన కొడుకు చేయిని నరికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు.. గురును ఊరివాళ్లు ఎందుకు వెలివేశారు? ప్రాణస్నేహితులుగా ఉన్న మొయిద్దీన్‌, గురు తండ్రి ఎందుకు శత్రువులుగా మారారు అన్నదే లాల్ సలామ్ మూవీ కథ.ఈ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్‌ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా కానీ కథను ఆసక్తికరంగా చెప్పడంలో ఐశ్వర్య రజనీకాత్ తడబడింది. లాల్ సలామ్ మూవీతో దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ మెగాఫోన్ పట్టారు.ధనుష్ హీరోగా నటించిన త్రీ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత వాయ్ రాజా వాయ్ అనే సినిమా చేసింది. లాల్‌సలామ్ మూవీలో టాలీవుడ్ సీనియర్ నటి జీవిత ఓ కీలక పాత్ర చేసింది.థియేటర్లలో అంతగా ఆకట్టుకోని రజనీకాంత్ లాల్‌సలామ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఒకే రోజు లాల్ సలామ్ మూవీ రెండు ఓటీటీలలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్ నెక్స్ట్ దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో రజనీకాంత్ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.. సన్ నెక్స్ట్‌లో కేవలం తమిళ వెర్షన్ మాత్రం విడుదలకానున్నట్లు సమాచారం.. మార్చి9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ మరియు సన్ నెక్స్ట్ ఓటీటీలలో లాల్ సలామ్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మార్చ్ ఫస్ట్ వీక్‌లో లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: