టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ హీరోబ్గా తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. దానితో ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కి విడుదల అయిన ఇండియన్ సినిమాలన్నింటినీ వెనక్కు నెట్టేసి టాప్ 1 స్థానంలో నిలిచింది. 

ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి కి విడుదల అయిన సినిమాలన్నింటి లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన ఈ సినిమా నిన్నటితో 50 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా 150 థియేటర్ లలో 50 రోజులను కంప్లీట్ చేసుకున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇది  ఇలా ఉంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ లో హీరో గా నటించిన తేజ కు ... ఈ మూవీ కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ కు ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ మూవీ కి కొనసాగింపుగా "జై హనుమాన్" అనే మూవీ ని రూపొందించనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: