మాచో స్టార్ గోపీచంద్ తాజాగా బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహించగా ... రవి బుస్రుర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాను మార్చి 8 వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తూ వస్తున్నారు. 

అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు అనగా మార్చి 2 వ తేదీన సాయంత్రం 5 గంటలకు కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ , హనుమకొండ ... వరంగల్ జిల్లాలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా వాటికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై కూడా జనాలు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc