ప్రతి వారం లాగానే ఈ వారం కూడా తెలుగు భాషలో కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫాం లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవి ..?  ప్రస్తుతం అవి ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మాస్ మహారాజ రవితేజ తాజాగా ఈగల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కావ్య దాపర్ హీరోయిన్ గా నటించగా ... అనుపమ పరమేశ్వరన్ ,  నవదీప్ , అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఈ టీవీ విన్ ... అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.

గేమ్ ఆన్ : ఈ మూవీ ప్రస్తుతం తెలుగు భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్విమ్మింగ్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటుడు సుహాస్ తాజాగా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott