టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీ లలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో సిద్ధార్థ్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో హీరో గా నటించి ఎన్నో విజయాలను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. అలాగే ఎన్నో తమిళ సినిమాలలో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈయన చిన్నా అనే సినిమాలో హీరో గా నటించాడు. చాలా కాలంగా వరుస అపజయాలతో డీలా పడిపోయిన సిద్ధార్థ్ "చిన్నా" మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు.

మొదట తమిళ్ లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను ఆ తర్వాత తెలుగు లో విడుదల చేయగా ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే చిన్నా మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న సిద్ధార్థ్ ఇప్పటికే తన తదుపరి మూవీ ని కూడా సెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో సిద్ధార్థ్ తన తదుపరి మూవీ ని చేయబోతున్నట్లు ఇప్పటికే ఐశ్వర్య , సిద్ధార్థ్ కి ఓ కథను వినిపించగా ... ఆ కథ సిద్ధార్థ్ కు అద్భుతంగా నచ్చడంతో ఐశ్వర్య దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ ని చేయడానికి సిద్ధార్థ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇకపోతే ఐశ్వర్య రజనీ కాంత్ కొంత కాలం క్రితమే లాల్ సలాం అనే సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ మూవీ లో విష్ణు విశాల్ హీరో గా నటించగా ... సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: