మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో నుపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ ... రవితేజ కు జోడి గా నటించారు. ఈ మూవీ లో రేణు దేశాయ్ , అనుపమ కేర్ , మురళీ శర్మ ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ నాలుగు భాషలలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ హిందీ వర్షన్ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం ఈ సంస్థ వారు అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ హిందీ వర్షన్ కి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే తాజాగా రవితేజ "ఈగల్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: