నేషనల్ క్రష్ రష్మిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అయితే తెలుగులోనే కాకుండా ఈ హీరోయిన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే రష్మిక జపాన్ కి వెళ్ళింది. జపాన్ లోని క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ కి రష్మిక కి పిలుపు రాగ.. ఆ అవార్డుల కొరకు ఈ హీరోయిన్ జపాన్ కి వెళ్లి అక్కడ తెగ సందడి చేస్తోంది.అంతేకాదు జపాన్ వెళ్లిన దగ్గర్నుంచి రష్మిక ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేస్తూ తెగ హుషారుగా కనిపిస్తోంది. కాగా నిన్న రాత్రి జరిగిన క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ లో స్టైలిష్ డ్రెస్ వేసుకొని వచ్చి అవార్డుని ప్రజెంట్ చేసింది రష్మిక. నిన్న మొత్తం రష్మిక కి సంబంధించిన ఆ వీడియో వైరల్ కాగా ..తాజాగా రష్మిక జపాన్ లో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ వేసింది.

రష్మిక తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసి..'చిన్నప్పట్నుంచి నేను జపాన్ కి వెళ్లాలని కలగనే దాన్ని. ఇన్ని రోజులుకి ఆ కల నెరవేరింది. ఇది నిజంగా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. యానిమే అవార్డ్స్ లో భాగం అయ్యాను, ఒకరికి అవార్డు ఇచ్చాను. ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ వారు నాకు ఇచ్చిన స్వాగతం.. నా పైన చూపించిన ప్రేమ, ఇక్కడి ప్రజలు, వాతావరణం, ఫుడ్.. అన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. జపాన్ చాలా స్పెషల్. థ్యాంక్యూ జపాన్. రియల్లీ ఐ లవ్ యు. ఇకపై ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను' అంటూ పోస్ట్ వేసింది ఈ హీరోయిన్.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్యనే యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉంది. ఈ చిత్రంతో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. త్వరలోనే రానున్న యానిమల్ పార్కులో కూడా రష్మిక తన గీతాంజలి పాత్రను కంటిన్యూ చేయనుంది. ఈ సినిమాలు కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా రష్మిక సైన్ చేసినట్లు వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: