కొన్ని సంవత్సరాల క్రితం శర్వానంద్ , జై , అంజలి , అనన్య ప్రధాన పాత్రలలో జర్నీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదట తమిళ భాషలో పెద్దగా అంచనాల లేకుండా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి సూపర్ ప్రశంసలను తెచ్చుకోవడంతో ఆ తర్వాత ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ఇకపోతే తెలుగు లో అప్పటికే శర్వానంద్ కు మంచి గుర్తింపు ఉండడంతో ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయింది. 

ఇక మంచి పర్వాలేదు అనే అంచనాల నడుమ 2011 వ సంవత్సరంలో తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ తో శర్వానంద్ కు ఉన్న క్రేజ్ మరింతగా పెరగగా ... అంజలి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత అంజలి కి తెలుగు లో వరుస సినిమా అవకాశాలు కూడా దక్కాయి. ఇకపోతే ఆ సమయం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

మూవీ మరికొన్ని రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తైన రీ రిలీస్ కాబోతోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా రీ రిలీజ్ కు సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేశారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: