తేజ సజ్జ హీరో గా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ను వరల్డ్ వైడ్ గా తెచ్చుకుంది. దానితో చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ భారీ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. 

ఇకపోతే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇకపోతే ఈ మూవీ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ ఎంట్రీ కి సంబంధించి అనేక వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఎట్టకేలకు ఈ సినిమా "ఓ టి టి" ఎంట్రీ కి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను "జీ 5" సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాని మార్చి 8 వ తేదీన "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు "జీ 5" సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా "ఓ టి టి" విడుదల కోసం కూడా ఎంతో మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: