నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితం హాయ్ నాన్న అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... ప్రియదర్శి , జయరామ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. శౌర్యవ్ అనే యువ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... వశిం అబ్దుల్ వాహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది.

మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్ లు దక్కాయి. చివరగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని ఈ మూవీ అందుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా మరొక కొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మార్చి 17 వ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు జెమినీ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: