ఉదయ్ కిరణ్ హీరో గా అనిత హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో 2001 వ సంవత్సరం నువ్వు నేను అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తెలంగాణ శకుంతల , తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలలో నటించగా ఆర్ పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఆ సమయం లో చిన్న మూవీ గా పెద్ద అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయం లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేయడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. 

ఇలా ఆ సమయంలో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాని తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్న అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చేసింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ఈ నెల లోనే రీ రిలీస్ చేయబోతున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ నెలలోనే ఈ సినిమాను రీ రిలీస్ చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించినప్పటికీ ఏ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఇందుకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలబడే అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టాయి. మరి నువ్వు నేను సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

uk