మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన మలయాళ నటుడే అయినప్పటికీ ఇప్పటికే మహానటి , సీత రామం అనే రెండు స్టేట్ తెలుగు సినిమాలలో నటించి ఈ రెండు మూవీ లతో కూడా అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన ఎంతో దగ్గర అయ్యాడు. ఇకపోతే ఈయన ముచ్చటగా మూడవ సారి స్టేట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అదే లక్కీ భాస్కర్. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. 

ఇకపోతే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ రోజు యువ నటి మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. దానితో లక్కీ భాస్కర్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మీనాక్షి చౌదరి కి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమాలో మీనాక్షి "సుమతీ" పాత్రలో కనిపించబోతోంది. ఇకపోతే ఈ చిత్ర బృందం వారు విడుదల చేసిన పోస్టర్ లో మీనాక్షి ఇంటి ముందు కూర్చొని ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. మహానటి , సీత రామం మూవీ లతో మంచి విజయాలను అందుకున్న దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మూడవ తెలుగు సినిమా కావడంతో ఈ మూవీ పై టాలీవుడ్ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc