హీరోయిన్ గా రాణించాలని సుమారు 9సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాందిని చౌదరి మంచినటి అన్న పేరు ఉంది. జాతీయ అవార్డు పొందిన ‘కలర్ ఫోటో’ మూవీలో హీరోయిన్ గా నటించిన ఆమెకు చెప్పుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రావడం తగ్గిపోవడంతో ఆమెకు ఏనాడు  నిరాశపడలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమె విశ్వక్ సేన్ తో కలిసి నటించిన ‘గామి’ సక్సస్ సాధించడంతో ఆమె పై తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి సంబంధించిన దర్శక నిర్మాతల దృష్టి పడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.అందం టాలెంట్ రెండు ఉన్నప్పటికీ ఆమెను ఇండస్ట్రీ వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు అన్న విమర్శలు కూడ ఉన్నాయి. అచ్చమైన తెలుగు అమ్మాయి అయిన ఈమె కిరణ్ అబ్బవరంతో ‘సమ్మతమే’ మూవీలో నటించింది. ప్రస్తుతం సక్సస్ అయిన ‘గామి’ మూవీతో విశ్వక్ సేన్ తో సమానంగా ఈమెకు పేరు వచ్చింది. డాక్టర్ జాహ్నవీ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.  కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా నిండైన దుస్తులతో గడ్డలు కట్టే చలిలో చాందిని చౌదరి ఈపాత్ర కోసం పడిన కష్టాన్ని హీరో విశ్వక్ సేన్ స్వయంగా తెలియచేశాడు. వాష్ రూమ్స్ లేని అత్యంత ఎత్తైన హిమాలయాల కొండల పై  చలికి తట్టుకుంటూ ఒక్క చుక్క మంచినీళ్లు కానీ ఆహారం కానీ లేకుండా సాయంత్రం వరకు షూటింగ్ చేసే సమయంలో తనతో పాటు సమానంగా కష్టపడ్డ చాందిని తీరును చూసి తాను ఆశ్చర్య పడ్డ విషయాన్ని విశ్వక్ సేన్ వివరించాడు.  చాందిని సూపర్ ఓవర్ గాలి వాన అన్ హర్డ్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించినప్పటికీ ఆమెకు ఇండస్ట్రీలో చెప్పుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రావడంలేదు. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా విడుదలైన ‘గామి’ ఆమెకు ఎంతవరకు కెరియర్ బ్రేక్ ఇస్తుంది అన్నవిషయమై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆమె బాలకృష్ణతో బాబి తీస్తున్న మూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. 2015లో ‘కేటుగాడు’ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమెకు సరైన సక్సస్ అందుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అనుకోవాలి..  మరింత సమాచారం తెలుసుకోండి: