ప్రస్తుతం మెగా కాంపౌండ్ లోని యంగ్ హీరోల పరిస్థితి అయోమయంగా ఉంది అంటూ ఇండస్ట్రీలోని కొందరు కామెంట్స్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి పవన్ కళ్యాణ్ లతో మెగా హీరోలకు ఒక గుర్తింపు రావడమే కాకుండా వారు నటించిన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చే విధంగా తెలుగు రాష్ట్రాలలో లక్షలస్థాయిలో మెగా వీరాభిమానులు ఏర్పడ్డారు.ఒకవిధంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ లు ఎదుగుదలకు మెగా అభిమానులు వారిపట్ల చూపించిన వీరాభిమానం ఒక కారణం. దీనితో ఈటాప్ హీరోలకు ఏర్పడ్డ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని నమ్ముకుని రామ్ చరణ్ అల్లు అర్జున్ లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టాప్ యంగ్ హీరోలుగా మారిపోయారు. అదే ట్రెండ్ ని కొనసాగిద్దామని వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ అల్లు శిరీష్ లు ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి మెగా అభిమానుల నుండి స్పందన అంతంత మాత్రంగానే వస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.వీరిలో కెరియర్ పరంగా సీనియర్ అయిన వరుణ్ తేజ్ ని వరస ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. ‘గని’ ‘గాండీవధారి అర్జున’ ఫెయిల్ అవ్వడంతో అతడి లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్’ కు స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగినప్పటికీ ఆ మూవీ పై ఎటువంటి క్రేజ్ ఏర్పడక పోవడంతో ఈసినిమాకు కనీసపు ఓపెనింగ్ కలక్షన్స్ రాలేదు అన్నవార్తలు వచ్చాయి.ఇక వైష్ణవ్ తేజ్ పరిస్థితి మరింత అయోమయంగా ఉంది. అతడు నటించిన ‘ఉప్పెన’ తప్ప మరే సినిమాకు కానీసపు కలక్షన్స్ కూడ రాలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘కొండపొలం’ ‘రంగరంగ వైభవంగా’ ‘ఆదికేశవ’ సినిమాలు హ్యాట్రిక్ పరాజయాలు పొందడంతో అతడితో సినిమాలు తీయాలి అనుకున్న నిర్మాతలు కూడ వెనక్కు వెళుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. యాక్సిడెంట్ తరువాత సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సక్సస్ అయినప్పటికీ అతడు ప్రస్తుతం నటిస్తున్న ‘గాంజా శంకర్’ మూవీ ఆగిపోయినట్లుగా రకరకాల గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. అదే కోవలో అల్లు శిరీష్ కూడ అడుగులు వేస్తూ ఉండటంతో మెగా యంగ్ హీరోలు కన్ఫ్యూజన్ లో ఉన్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: