తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడ రాజమౌళి పేరు మారుమ్రోగి పోతోంది. ఇలాంటి గొప్ప వ్యక్తితో సినిమాలు చేయాలని ఇండియాలోని ప్రముఖ నటీనటులు ప్రముఖ నిర్మాతలు జక్కన్న తీసే భారీ సినిమాలలో తమకు ప్రాధాన్యత ఉంటే బాగుంటుందని ఓపెన్ గానే చెపుతున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఈ మితిమీరిన పొగడ్తలకు ఏమాత్రం దొరకకుండా తన భారీ సినిమాల నిర్మాణం చేస్తూనే ఉన్నాడు.ఈవారం మల్టీ ప్లెక్స్ ధియేటర్లకు కలక్షన్స్ విషయంలో సహకరించిన సినిమాల లిస్టులో రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగులోకి డబ్ చేసిన ‘ప్రేమలు’ మూవీ కలక్షన్స్ పరంగా సంతృప్తిగా ఉండటంతో ఈ మూవీ సక్సస్ మీట్ ను ఈమధ్య భాగ్యనరంలోని ఒక హోటల్ లో నిర్వహించారు. ఈ సక్సస్ మీట్ కు ముఖ్య అతిధిగ వచ్చిన రాజమౌళి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి.సినిమా మళయాళంలో సూపర్ హిట్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ తెలుగులో కూడ ఈ మూవీ సక్సస్ అయినందుకు ఆనందంగా ఉంది అంటూ ఈ మూవీ యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ మూవీ నిర్మాత కార్తికేయ రాజమౌళి తన పక్కన ఉండగా మాట్లాడుతూ ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు ఎంత వేగంగా పూర్తి చేశారో వివరించాడు. కార్తికేయ మాట్లాడుతూ ఉండగా జక్కన్న కలుగజేసుకుని “రేయ్.. నన్ను వెనకాలే పెట్టుకుని ఫాస్ట్‌ గా చేశాం, వారం రోజుల్లో చేశాం. అని చెప్పకురా” అని అనడంతో ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులు అంతా జక్కన్న తనపై తాను సెటైర్ వేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.సినిమాలు తీసే విషయంలో రాజమౌళి చాల నెమ్మదిగా తీస్తాడు అన్నవిషయం ఓపెన్ సీక్రెట్. దీనితో రాజమౌళి బంధిఖానాలోకి హీరోలు వెళ్ళిన తరువాత వారు ఎప్పుడూ వారు ఎప్పుడూ బయటకు వస్తారో వారికే తెలియని పరిస్థితి. ఏమైనా కార్తికేయ ఆ ఫంక్షన్ లో అన్నమాటలకు జక్కన్న తనకు తానుగా తనపై తాను సెటైర్ వేసుకున్నాడు అనుకోవాలి..    మరింత సమాచారం తెలుసుకోండి: