అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఏప్రియల్ 5న విడుదల కావలసి ఉంది. అయితే ఈమూవీ షూటింగ్ పూర్తి అవ్వడంలో ఆలస్యం జరగడంతో అక్టోబర్ 10న ఆనెలలో రాబోతున్న ‘దసరా’ పండుగను టార్గెట్ చేస్తూ విడుదల చేస్తున్నారు. దీనితో ఈసినిమా విడుదలకు ఇంకా 6నెలల గ్యాప్ ఏర్పడటంతో తారక్ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.అయితే వారిని ఉత్సాహపరిచి వారికి జోష్ ను కలిగించడానికి ‘దేవర’ టీమ్ ‘బాహుబలి’ స్ట్రాటజీని అనుసరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ విడుదలకు 6నెలలు ముందే ఆసినిమా పై మ్యానియా పెంచడానికి ఆసినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన నటీనటుల ఫస్ట్ లుక్ ను నెలకి ఒకటి చొప్పున విడుదలచేసి ఆమూవీకి సంబంధించిన వార్తలు ఎప్పుడూ మీడియాలో ఉండేలా అప్పట్లో రాజమౌళి చాల తెలివిగా వ్యవహరించాడు.ఇప్పుడు ఇదే పద్ధతి ‘దేవర’ టీమ్ అనుసరిస్తూ ఈసినిమాకు సంబంధించిన కీలక పాత్రల ఫస్ట్ లుక్ ను నెలకి ఒకటి చొప్పున వచ్చేనెల ‘ఉగాది’ పండుగ రోజు నుండి విడుదల చేయడమే కాకుండా ఈసినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను కూడ మీడియాకు విడుదల చేస్తూ ‘దేవర’ మూవీని ఎలాంటి భారీ స్థాయిలో తీస్తున్నారో అందరికీ తెలిసే విధంగా ఈమూవీని పబ్లిసిటీ స్ట్రాటజీని చాల తెలివిగా అమలుచేయాలని దర్శకుడు కొరటాల శివ పక్కా ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.ఇది ఇలా ఉంటే ‘దేవర’ మూవీ కథలో తండ్రి కొడుకుల పాత్రలలో జూనియర్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఈమూవీ మొదటి భాగంలో కొడుకు పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలు చూపెట్టి పార్ట్ 2లో తండ్రి పాత్ర చుట్టూ ‘దేవర’ మూవీ కథ నడుస్తుందని టాక్. ‘బాహుబలి’ లాగే రెండు కాలాల్లో రెండు పాత్రలను చూపించి తద్వారా ఒకదానితో మరొకటి ముడిపెట్టే విధానంగా ‘బాహుబలి స్క్రీన్ ప్లే ‘దేవర’ లో కొంతవరకు కనిపిస్తుందని టాక్. ప్రస్తుతం తారక్ జాన్వీల పై ఒక పాటతో పాటు బీచ్ ఒడ్డున సముద్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్స్ ను గోవా పరిసర ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది..  మరింత సమాచారం తెలుసుకోండి: