నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కొంత కాలం క్రితమే నాని , వివేక్ కాంబో లో అంటే సుందరానికి అనే మూవీ రూపొందింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను రాబట్ట లేకపోయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. 

ఇకపోతే విరి కాంబోలో రూపొందుతున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇది వరకే నాని మరియు ప్రియాంక కాంబో లో నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమా రూపొందింది. వీరి కాంబో లో కూడా ఇది రెండవ సినిమానే కావడం విశేషం. ఇది అలా ఉంటే ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ కి సంబంధించిన అదిరిపోయే యాక్షన్ షెడ్యూల్ ని మార్చి 18 వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: