నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. పోయిన సంవత్సరం నాని , శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన దసరా అనే పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. ఇదే నాని కి మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ. ఇకపోతే భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరో గా నటించాడు. శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా తెలుగు , తమిళ , కన్నడ , హిందీ  భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.

మూవీ తో నాని క్రేజ్ ఇండియా వ్యాప్తంగా బాగా పెరిగింది. ఇకపోతే ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ కే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఓ చిన్న వీడియోను విడుదల చేయగా అది అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి దాదాపుగా 100 కోట్లకు మించి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ నిజం గానే ఈ సినిమాకు గనుక 100 కోట్లకు మించి ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు అయితే నాని కెరియర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమాకు ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: