నిజానికి ఈ అర్జున్ రెడ్డి అనే ఈ పాత్ర విజయ్ చేయకపోయి ఉంటే 'కబీర్ సింగ్' అసలు పుట్టేవాడు కాదు. థ్యాంక్యూ విజయ్" అని పేర్కొన్నాడు. అంతేకాదు విజయ్కి ముద్దు పెడుతూ, అప్యాయంగా హగ్ చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఇద్దరు హీరో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్పై అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఫైనల్లీ అర్జున్ రెడ్డి, కబీర్ సింగను పక్క పక్కన చూస్తున్నాం'అని ఓ నెటిజన్ కామెంట్స్ చేయగా మరోక యూజర్ రణ్బిర్ కపూర్ మిస్సింగ్ అంటూ కామెంట్ చేశారు.కాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోల్డ్ కంటెంట్తో వచ్చిన ఈ సినిమా విమర్శలు ఎదుర్కొంటూనే బ్లక్బస్టర్ విజయం సాధించింది. ఇందులో విజయ్ పర్ఫామెన్స్కి అంతా ఫిదా అయ్యారు. అతడి యాక్టింగ్కి విమర్శల ప్రశంసలు దక్కాయి. అప్పటికే పెళ్లి చూపులు సినిమాతో కెరీర్ని నిలదొక్కుకుంటున్న విజయ్ని 'అర్జున్రెడ్డి' స్టార్ హీరోని చేసింది. ఈ మూవీకి విపరీతమైన బజ్, రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారు. అదే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. హిందీలోనూ ఈ మూవీ సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు వరస ప్లాప్స్ చూస్తున్న షాహిద్కు 'కబీర్ సింగ్' భారీ విజయం అందించింది. ఈ సినిమాకు హిందీలోనూ వివాదాలు, విమర్శలు వెంటాడిన బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి