గత నాలుగు దశాబ్ధాలుగా తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీని శాసిస్తున్న చిరంజీవి 68 సంవత్సరాల వయస్సు దాటినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే నో చెప్పే సాహసం సాధారణంగా ఎవరు చేయరు. అయితే మళయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ మాత్రం చిరంజీవి స్వయంగా రెండు సార్లు తన సినిమాలో నటించమని అడిగినప్పటికీ అతడు నో చెప్పాడట.ఈవిషయాన్ని స్వయంగా పృధ్వీరాజ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసి అందరికీ షాక్ ఇచ్చాడు. మళయాళ సినిమాలలో విభిన్న పాత్రలకు చిరునామాగా కొనసాగే పృధ్వీరాజ్ గత నాలుగు సంవత్సరాలుగా ఒకేఒక్క సినిమాలో తన సర్వశక్తులు ధారపోసి నటిస్తున్నాడు. ఆ మూవీ పేరు ‘ఆడుజీవితం’ ఈ మూవీలోని అతడి పాత్ర కోసం 31 కేజీలు బరువు తగ్గి అత్యంత సహజంగా నటిస్తున్నాడు.మూవీ ఈనెల 28న పాన్ ఇండియా మూవీగా అనేక భాషలలొ విడుదలకాబోతోంది. ఈ మూవీలోని అతడి లుక్ కోసం కఠినమైన డైటింగ్ చేయడమే కాకుండా అతడి లుక్ చాల రఫ్ గా కనిపించడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలోని అతడి పాత్రతో చరణ్ కు జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.గతంలో మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ మూవీలో నటిస్తున్నప్పుడు పృధ్వీరాజ్ ని తన మూవీలో ఒక కీలక పాత్రలో నటించమని చిరంజీవి కోరాడట. అయితే తాను ‘ఆడుజీవితం’ మూవీలో నటిస్తున్న విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకు వెళ్ళి సున్నితంగా చిరంజీవికి నో చెప్పాడట. ఆతరువాత చిరంజీవి నటించిన ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ మూవీలో నటించమని చిరంజీవి ఎంత ఒత్తిడి చేసినా తాను నటిస్తున్న ‘ఆడుజీవితం’ పూర్తి అయ్యేవరకు మరొక సినిమాను చేయనని చిరంజీవికి నో చెప్పి క్లారిటీ ఇచ్చాడట పృధ్వీరాజ్..    

మరింత సమాచారం తెలుసుకోండి: