తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శర్వానంద్ ఒకరు. ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత హీరో గా అవకాశాలను దక్కించుకున్న ఈయన తన కెరీయర్ లో చాలా సినిమాలలో హీరో గా నటించి అందులో అనేక మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు.

అలా చాలా కాలం పాటు విజయాలను అందుకుంటున్న శర్వా కొంత కాలం పాటు వరస అపజాయలను అందుకున్నాడు. అలా చాలా సంవత్సరాల పాటు వరుస అపజయాలతో డీలా పడిపోయిన ఈయన ఆఖరుగా "ఒకే ఒక జీవితం" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మాత్రం శర్వానంద్ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి.

అందులో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఒకటి. ఈ మూవీ లో సంయుక్త మీనన్ , సాక్షి వైద్య హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... విశాల్ చంద్ర శేఖర్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. జ్ఞాన శేఖర్ వి ఎస్ సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను రామ్ అబ్బరాజు కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ "శర్వా 37" అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయ్యింది. ఇకపోతే ఈ మూవీ కి "నారి నారి నడుమ మురారి" అనే టైటిల్ ను ఈ చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు దాదాపు ఇదే టైటిల్ ను ఈ మూవీ యూనిట్ కన్ఫామ్ చేసినట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో విలువడబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: