సంక్రాంతి తరువాత సినిమాలు చూడటం ప్రేక్షకులు పూర్తిగా తగ్గించివేయడంతో సినిమాల పరిస్థితి ఆ సినిమాలను కొనుక్కున్న బయ్యర్ల పరిస్థితి అయోమయంగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో టాలీవుడ్ ఇండస్ట్రీకి సమ్మర్ సీజన్ మొదలు అవ్వగానే ధియేటర్లకు జనం బాగా వస్తారు అని ఆశపడ్డ ఇండస్ట్రీ వర్గాలకు ఈసారి కొనసాగుతున్న ఐపిఎల్ టోర్నమెంట్ ఊహించిన దానికంటే ఎక్కువ షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి.



ప్రతి సంవత్సరం జరిగే ఐపీల్ టారన్మెంట్ కన్నా ఈసంవత్సరం జరుగుతున్న టోర్నమెంట్ ఫీవర్ మరీ హెచ్చుగా ఉండటంతో జనం అంతా ఈ మ్యాచ్ లను టీవీలలో చూడటానికి బాగా ఆశక్తి కనపరుస్తూ ఉండటంతో ధియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్, ముంబై పోరు చూశాక ఎవరైనా సరే దాని జ్ఞాపకాల నుంచి బయట పడటం చాలకష్టం అని అంటున్నారు.



వేలాది రూపాయల ఖరీదైన టిక్కెట్లను భాగ్యనగరం లోని యూత్ బ్లాక్ లో కొనుక్కుని కూడ చూస్తున్నారు అంటే ఈ సంవత్సరం ఈ టారన్మెంట్ మ్యానియా ఈ సంవత్సరం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఈ మ్యానియా వల్ల టాక్ బాగా వచ్చిన సినిమాల గురించి కూడ యూత్ పట్టించుకోవడం లేదనీ దీనితో సినిమాల కలక్షన్స్ పూర్తిగా డల్ అయిపోయాయి అన్న వార్తలు వస్తున్నాయి.



ఇలాంటి పరిస్థితుల ప్రభావం వల్ల లేటెస్ట్ గా విడుదలైన ‘టిల్లు స్క్వేర్’ త్వరలో విడుదల కాబోతున్న ‘ఫ్యామిలీ స్టార్’ కలక్షన్స్ పై కొంత ప్రభావం చూపెట్టే స్పష్టమైన పరిస్థితి కనిపిస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఈ పరిస్థితులకు తోడు మే నెలలో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు కూడ జరగబోతున్న పరిస్థితులలో ఈ సమ్మర్ సీజన్ ఆశలను టాలీవుడ్ ఇండస్ట్రీ వదులుకోవడం మంచిది అంటూ కొందరు సలహాలు యిస్తున్నట్లు టాక్. ఈపరిస్థితులతో బయ్యర్లు గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: