ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిరంజీవి మోహన్ బాబులు ప్రాణస్నేహితులు. అయితే ఆతరువాత మారిన పరిస్థితులలో చిరంజీవి మోహన్ బాబుల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆగ్యాప్ వారిద్దరి మధ్య అనేక సందర్భాలలో మాటల యుద్ధానికి కూడ దారితీసింది. వారిద్దరి మధ్య పరిస్థితి అలా ఉన్నప్పటికీ రామ్ చరణ్ మంచు మనోజ్ లు మాత్రం చిన్ననాటి నుండి మంచి స్నేహితులు.అయితే ఈవిషయాన్ని వారు బయటకు చెప్పుకోరు. కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ ఈమధ్యనే మళ్ళీ ఈటీవీ కోసం ఒక టాక్ షోను హోస్ట్ చేసి ఈమధ్య మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. లేటెస్ట్ గా జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు అతిధిగా వచ్చిన మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి ఒక విషయాన్ని బయటపెట్టి ఆ కార్యక్రమానికి వచ్చిన వారికి ఆశ్చర్యాన్ని కలిగించాడు.  2018లో ఒక తెలుగు కుటుంబం దుబాయ్ లో అనుకోని పరిస్థితుల వల్ల చిక్కుల్లో ఇరుక్కుని పాస్ పోర్ట్ వీసా చేతిలో లేక ఇబ్బందులలో ఉన్నప్పుడు తనకు ధన సహాయం చేయమని ఫోన్ వచ్చిన విషయాన్ని తెలియచేశాడు. అయితే ఆ ఇబ్బందులలో ఉన్న వ్యక్తికి సహాయం చేయాలి అంటే చాల ధనం లక్షలలో అవసరం అనీ అందువల్ల ఆయవ్యక్తికి తాను పూర్తిగా ధన సహాయం చేయలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.అయితే ఆ ఇబ్బందులలో ఉన్న వ్యక్తి నుండి తనకు తరుచూ ఫోన్ కాల్స్ వస్తూ ఉండటంతో ఏమి చేయాలో తెలియక తాను రామ్ చరణ్ కు ఫోన్ చేసి ఆ విషయాన్ని వివరించినప్పుడు చరణ్ మరొకసారి  ఆలోచించకుండా కేవలం 5 నిముషాల వ్యవధిలో చరణ్ ఆ ఇబ్బంధులలో ఉన్న వ్యక్తికి 5 లక్షలు పంపించి తన ఉదారతను చాటుకున్న విషయాన్ని తెలియచేశాడు. వాస్తవానికి ఆవ్యక్తి ఎవరో కూడ చరణ్ కు తెలియదని ఎవరైనా కష్టాలలో ఉంటే చరణ్ స్పందన వేరుగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేశాడు..
మరింత సమాచారం తెలుసుకోండి: