టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా హీరో అయినటువంటి విజయ్మూవీ ప్రమోషన్ లలో పాల్గొంటున్నాడు . అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ యువ నటుడు పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు ... తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ మాట్లాడుతూ ... నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కచ్చితంగా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా. నేను చేసుకోబోయే అమ్మాయి నా తల్లిదండ్రులకు కచ్చితంగా నచ్చాలి. అప్పుడే నేను వివాహం చేసుకుం టా అని తాజాగా విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

ఇకపోతే విజయ్ హీరో గా రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మని మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . గోపి సుందర్మూవీ కి సంగీతం అందించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను పాటలను విడుదల చేయ గా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd