ప్రభాస్ అభిమానుల ఆశలు అన్నీ ‘కల్కి 2898’ పైనే ఉన్నాయి. ఈమూవీ 1000 కోట్ల కలక్షన్ ఫిగర్ ను అందుకోవడం ఖాయం అన్న అభిప్రాయంలో డార్లింగ్ అభిమానులు ఉన్నారు. ఈమూవీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సెంటిమెంట్ రిలీజ్ డేట్ మే9న ‘కల్కి’ విడుదల కావడం కుదరని పరిస్థితి అన్న సంకేతాలు వస్తున్నాయి.మే 13న తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల పండుగ కావడంతో ప్రజల దృష్టి అంతా ఎన్నికల పై ఉంటుంది కాబట్టి ఈ మూవీని ఎట్టి పరిస్థితులలోను మే 9న విడుదల చేయవద్దని ఈమూవీ బయ్యర్లు ఈమూవీ నిర్మాతల పై చేసిన ఒత్తిడి సఫలం కావడంతో ఈమూవీని మే 30న విడుదల చేయాలని ఈమూవీ నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చారు అని అంటున్నారు. దీనికితోడు ఈమూవీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ కు సంబంధించి వస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదనీ గుసగుసలు వినిపిస్తున్నాయి.దీనితో ఎలర్ట్ అయిన మూవీ నిర్మాతలు తమ సినిమా రిలీజ్ డేట్ పై ఒక స్పష్టమైన క్లారిటీకి రావడమే కాకుండా ఈమూవీని మే 30న విడుదల చేసే విధంగా నిర్మాతలు ఈమూవీ బయ్యర్లకు లీకులు ఇస్తున్నట్లు టాక్. మే 30వ తారీకున విడుదల కాబోతున్న ఈమూవీ మ్యానియాను పెంచచడానికి ఈమూవీ నిర్మాతలు ప్రతి ఊరిలోనూ ఆఊరి ప్రముఖులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ‘కల్కి 2898’ సినిమాకు సంబంధించి షూటింగ్ సమయంలో తాము పడ్డ కష్టాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా చేసి ఆతరువాత మాత్రమే ‘కల్కి’  అధికారిక రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు అన్న మాటాలు వస్తున్నాయి.వాస్తవానికి ‘కల్కి’ తప్ప మరే టాప్ హీరో సినిమా ఈ సమ్మర్ సీజన్ పూర్తి అయ్యేవరకు  విడుదల కాని పరిస్థితులలో ప్రభాస్ ‘కల్కి’ కలక్షన్స్ కు ఇక హద్దులు లేవు అంటూ అభిమానులు ఈమూవీ రిలీజ్ డేట్ గురించి కలలు కంటూ రోజులు నెట్టుకొస్తున్నారు అని అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: