మంచు మనోజ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాకి మంచు విష్ణు స్వయంగా స్క్రీన్ ప్లే ను అందిస్తున్నాడు. మోహన్ బాబు ఈ మూవీ ని ఎంతో భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో ఎంతో మంది దేశ దాప్తంగా క్రేజ్ ఉన్న నటీనటులు నటిస్తున్నారు. వారు ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం.


మూవీ లో హీరో గా మంచు విష్ణు కనిపించనుండగా ... మోహన్ బాబు కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో మరొక గొప్ప పాత్రలో కనిపించబోతూఉండగా ... మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ , కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి శివరాజ్ కుమార్ , అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుత మైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ ... వీరితో పాటు ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన నటి మనులలో ఒకరు అయినటువంటి లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు


 వీరితో పాటు బ్రహ్మానందం , శరత్ కుమార్  , కౌశల్ మండ , రాహుల్ మాధవ్ , దేవరాజ్ , ప్రీత్ ముకుందన్ , ఐశ్వర్య బక్షారన్ , మధు ఈ మూవీ లో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇలా ఈ మూవీ లో ఎంతో మంది ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన నటీ నటులు కనిపించబోతున్నారు. దానితో ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: