రాజమౌళి సుకుమార్ లు పాన్ ఇండియా దర్శకులుగా దూసుకు పోతూ ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం  వీరెవరితోను పోటీ  పడలేకపోవడం మాటల మాంత్రీకుడి అభిమానులకు నిరాశను  కలిగిస్తోంది. ‘అల వైకుంఠాపురంలో’ లాంటి ఇండస్ట్రి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ కి మహేష్ తో  ‘గుంటూరు కారం’ తీయడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఇంత గ్యాప్ తో తీసిన ఈమూవీ పూర్తిగా అంచనాలను అందుకోలేక పోవడంతో ఈమూవీ విడదల తరువాత సోషల్ మీడియాలో  త్రివిక్రమ్ ను టార్గెట్  చేసిన విషయం తెలిసిందే.జనవరిలో జరిగిన ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత త్రివిక్రమ్ శ్రీనవాస్ ఏఫిలిమ్ ఫంక్షన్ లోనూ కనిపించడంలేదు. ఆసినిమా విడుదలైనతరువాత జరిగిన సక్సస్ మీట్ లో కూడ త్రివిక్రమ్ కనిపించలేదు. దీనితో సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోలింగ్ కు త్రివిక్రమ్ హర్ట్ అయ్యాడు అంటూ కొందరు ఊహాగానాలు చేశారు.  ‘గుంటూరు కారం’ ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసింది. ఈవిషయం పై కూడ త్రివిక్రమ్ స్పందించలేదు.దీనితో త్రివిక్రమ్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి ‘పుష్ప 2’ తరువాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో మూవీ చేయవలసి ఉంది. ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడ ప్రస్తుతం జరగడంలేదు అని అంటారు. దీనికితోడు ‘పుష్ప 2’ తరువాత బన్నీ తమిళ దర్శకుడు అట్లీ తో సినిమా చేయడం ఖాయం అని అంటున్నారు. బన్నీ త్రివిక్రమ్మూవీ క్యాన్సిల్  అయిందా అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు.ఈమధ్య త్రివిక్రమ్ నాని తో ఒక సినిమా చేస్తాడు అన్న వార్తలు వచ్చాయి. అయితే డానికి సంబంధించిన వార్తలు కూడ బయటకు రావడం లేదు. దీనికితోడు నానీ కూడ ఈవిషయం పై ఎటువంటి లీకులు ఇవ్వడంలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య త్రివిక్రమ్ తో సినిమాను చేయడానికి నితిన్ నాగశౌర్య నాగచైతన్య లాంటి హీరోలు రెడీగా ఉన్నప్పటికీ త్రివిక్రమ్ ఆలోచనలు మాత్రం వేరేవిధంగా ఉన్నాయి అంటూ ఒక ప్రచారం ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతుతొంది..

మరింత సమాచారం తెలుసుకోండి: