టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయ్ ఆంటోని ఒకరు. ఈయన కొంత కాలం క్రితం విడుదల అయిన బిచ్చగాడు అనే సినిమాలో హీరో గా నటించి ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ సినిమా విజయం తర్వాత విజయ్ తను నటించిన చాలా సినిమాలను తెలుగులో విడుదల చేశాడు. 

కొంతకాలం క్రితమే ఈయన "బిచ్చగాడు 2" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈయన స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాతో ఈయనకు పర్వాలేదు అనే స్థాయి విజయం దక్కింది. తాజాగా విజయ్ ఆంటోనీ లవ్ గురు అనే సినిమాలో హీరో గా నటించాడు. మృణాళిని రవిమూవీ లో విజయ్ కి జోడీగా నటించగా ... విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణ లో విజయ్ ఆంటోనీమూవీ ని నిర్మించారు.

వినాయక్ వైద్యనాథన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా ఏప్రిల్ 11 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ ని చాలా తక్కువ ధరకే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా యొక్క టికెట్ ధరను ఏ మల్టీ ప్లెక్స్ లో అయినా సరే 150 రూపాయలు గానే ఫిక్స్ చేసినట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా చాలా తక్కువ ధరకే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ కలక్షన్ లు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

va