ఊహలు గుసగుసలాడే తెలుగు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీవకి పరిచయం అయిన రాశి కన్నా ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తో పాటు వరస తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం రాశి తమిళ్ లో రూపొందుతున్న "అరుణ్మనై 4" సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. 

ఈ సినిమాకు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి తమన్న కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే "అరుణ్మనై" సిరీస్ లో భాగంగా వచ్చిన 3 మూవీ లు వచ్చాయి. అవి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఈ సిరీస్ లోని మూవీ లు తెలుగు లో వేరు వేరు పేర్లతో విడుదల అయ్యాయి.

ఇది ఇలా ఉంటే "అరుణ్మనై 4" సినిమా కూడా తెలుగు లో విడుదల కానుంది .ఈ సినిమా తెలుగు లో "బాక్" అనే పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాలోని రాశి ఖన్నా  క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేశారు.

పోస్టర్ లో భాగంగా ఈ సినిమాలో రాశి కన్నా "మాయ" అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే రాశి కన్నా ఇప్పటికే "అరుణ్మనై 3" లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా ఈమెకు తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించినప్పటికీ ఈ మూవీ తెలుగులో మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk