మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని మృణాల్ ఠాగూర్, దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మృణాల్ క్రేజ్ ఒక్క సారిగా తెలుగులో అమాంతం పెరిగిపోయింది.

ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుస సినిమా అవకాశాలు తెలుగులో దక్కుతున్నాయి. ఇప్పటికే ఈమె హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలోని ఈ ముద్దుగుమ్మ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈమె నటన విషయంలో ఎవరు ఏ వంకా పెట్టకపోయినాప్పటికీ ఈమె ఎంచుకునే  కథల విషయంలో మాత్రం చాలా మంది ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకో అంటే..? ఈమె ఇప్పటివరకు తెలుగులో మూడు సినిమాలలో నటించింది.

అందులో ఈమె మూడు సినిమాలలో కూడా దాదాపు ఒకే రకమైన కథతో వచ్చిన సినిమాల్లో నటించింది. సీత రామం సినిమాలో ఈమె ధనవంతురాలైన అమ్మాయి. కానీ ఒక పేదవాడు, అనాధను ప్రేమిస్తుంది. ఇక హాయ్ నాన్న సినిమాలో కూడా అంతే నాని పేదవాడు అలాగే అనాధ. ఈమె ధనవంతురాలు అయినప్పటికీ నాని ని ప్రేమించు పెళ్లి చేసుకుంటుంది. ఇక తాజాగా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ లో కూడా ఈమె కోటీశ్వరులు. విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. అయినప్పటికీ ఈయనను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇలా ఎప్పుడూ ఒకే రకమైన కథలను కావాలను మృణాల్ కావాలనే ఎంచుకుంటుందా..? లేక అనుకోకుండా ఇలాంటి కథలు వస్తున్నాయా అని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: