సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. అలా వచ్చే వారిలో కొంత మందికి నటించిన మొదటి సినిమా హిట్ అయినట్లు అయితే తర్వాత క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి. కానీ అతి తక్కువ మందికి మాత్రమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించడం మొదటి సినిమానే విడుదల కాకుండా చాలా క్రేజీ సినిమాలలో ఆఫర్లు దక్కుతూ ఉంటాయి. ప్రస్తుతం అలా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో భాగ్య శ్రీ భొర్సే ఒకరు. ఈమె ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.

మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ సినిమా నుండి ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మినహాయిస్తే ఎలాంటి కంటెంట్ కూడా బయటికి రాలేదు. అయినప్పటికీ ఈమెకు వరుస పెట్టి తెలుగులో క్రేజీ మూవీలలో అవకాశాలు దక్కుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఇప్పటికే ఈ బ్యూటీని హీరోయిన్ గా చిత్ర బృందం కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక నాచురల్ స్టార్ నాని హీరో గా సుజిత్ దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మనకు తెలిసిందే.

మూవీ యూనిట్ కూడా ఈ ముద్దుగుమ్మనే తమ సినిమాలో హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీలలో భాగ్య శ్రీ హీరోయిన్ గా కన్ఫామ్ అయినా అప్డేట్ ను కూడా మరికొన్ని రోజుల్లో ఈ మూవీ యూనిట్స్ బయటకు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీ మరో రెండు తెలుగు క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. భాగ్య శ్రీ కనుక ఈ మూడు మూవీ లతో మంచి విజయాలను అందుకున్నట్లు అయితే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bsb