ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇండియాలో డేవిడ్ వార్నర్ కు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. అయితే డేవిడ్ వార్నర్ కు క్రికెట్ తో పాటు యాక్టింగ్ పరంగా మంచి స్కిల్ ఉంది.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు తరచూ ఆయన టాలీవుడ్ యాక్టర్స్ సాంగ్స్ రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించేవాడు...అయితే ఇప్పుడు ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లోనే నటించే ఛాన్స్ కొట్టేశాడు.ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్  ఓ ఫన్నీ యాడ్ ను రూపొందించింది. అందులో మన టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మరియు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇద్దరూ నటించారు. ఇప్పుడీ ఫన్నీ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఎదురు చూస్తుండగా వార్నర్ మాత్రం తన యాక్టింగ్ తో అంతటి దర్శకుడికే దడ పుట్టించాడు.

ఈ యాడ్ లో మొదట రాజమౌళి క్రికెట్ మ్యాచ్ టికెట్ కౌంటర్ బయట నిల్చొని వార్నర్ కు ఫోన్ చేస్తాడు. "డేవిడ్ గారు.. మీ మ్యాచ్ టికెట్లపై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా...?" అని అడుగుతాడు. దానికి వార్నర్ స్పందిస్తూ.. "రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది' అని చెప్తాడు.. మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడుగుతాడు.అలా అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరో ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. అది రాజమౌళి డైరెక్షన్ లో తనకు ఓ ఛాన్స్ ఇవ్వమని కోరతాడు.అయితే ఆ ఛాన్స్ ఇచ్చే లోపే ఒకవేళ డేవిడ్ వార్నర్ నిజంగానే తన డైరెక్షన్ లో నటిస్తే ఏమవుతుందో రాజమౌళి ఊహించుకుంటారు.. సెట్స్ లో వార్నర్ డ్యాన్స్, డైలాగులు ఊహించుకొని రాజమౌళి జడుసుకుంటాడు.నీకు ఆ ఛాన్స్ ఇచ్చే కంటే క్రెడ్ యూపీఐకి అప్‌గ్రేడ్ అవడమే బెటర్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఈ ఫన్నీ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: