యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబో లో రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో పొందుతున్న దేవర మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఈ భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క నార్త్ ఇండియా హక్కులను ఇప్పటికే అమ్మి వేసింది. ఇక తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను మరియు డిజిటల్ హక్కులను కూడా అమ్మివేసింది. తాజాగా అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను టి సిరీస్ సంస్థ దక్కించుకోగా ... ఓ టి టి హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: