ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం "యాత్ర 2" ఈ మూవీ లో వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవ నటించగా ... మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ ఇండస్ట్రీవలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి మమ్ముట్టి గారు పోషించారు. మహి వి రాఘవ్ ఈ మూవీ.కి దర్శకత్వం వహించారు. 

2019 వ సంవత్సరం విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీవని తీసుకువచ్చారు. యాత్ర సినిమాలో వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవితానికి సంబంధించిన సన్నివేశాలను చూపించగా ... "యాత్ర 2" లో వైఎస్ జగన్ కు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ఇకపోతే యాత్ర మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో "యాత్ర 2" మూవీ పై మొదటి నుండి తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన "యాత్ర 2" మాత్రం ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ వారు ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: